న్యూఢిల్లీ, నవంబర్ 18 : దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఈ నెల 20న రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. గురువారం ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్..ఈ నెల 26న ముగియనున్నదని తెలిపింది. షేరుకు రూ.1,800 చొప్పున రూ.5 ముఖ విలువ కలిగిన 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నది. అర్హత కలిగిన వాటాదారులు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయవచ్చునని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. బైబ్యాక్‌ను రెండు వర్గాలుగా విభించిన సంస్థ..చిన్న స్థాయి షేరు హోల్డర్లకు మొత్తం ఈక్విటీ షేర్లలో 15 శాతం వీరికి కేటాయించింది. మిగతా షేర్లు జనరల్ విభాగానికి చెందిన వాటాదారులు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
ఇప్పటికే సంస్థ 2017లో రూ.13 వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసిన సంస్థ..మళ్లీ 2022లో రూ.9,300 కోట్ల విలువైన షేర్లను ఒపెన్ మార్కెట్లో, 2019లో రూ.8,260 కోట్ల విలువైన షేర్లు, మూడోసారి రూ.9,200 కోట్ల విలువైన షేర్లు, అలాగే 2022-23లో రూ.9,300 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్లు 13.05 శాతం వాటా కలిగివున్నారు.