Infosys – Nestle India | గ్రోత్ గైడెన్స్ అంచనాలు తగ్గింపుతో ఇన్ఫీ షేర్ పతనం.. నెస్లే ఎం-క్యాప్ రూ.10,610 కోట్లు లాస్ ఇలా
Infosys - Nestle India | గ్రోత్ గైడెన్స్ అంచనాలు తగ్గించడంతో ఇన్ఫీ షేర్ ఒక శాతం పతనమైతే, మిల్క్ ఉత్పత్తుల్లో చక్కెర శాతం ఎక్కువ వాడుతున్నట్లు వార్తలు రావడంతో నెస్లే ఇండియా ఎం-క్యాప్ రూ.10610 కోట్లు కోల్పోయింది.
Infosys – Nestle India | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ గైడెన్స్ అంచనాలను కుదించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఇన్ఫీ గ్రోత్ గైడెన్స్ అంచనాలు మార్కెట్ వర్గాలకు రుచించక పోవడంతో శుక్రవారం ఇన్ఫీ షేర్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. బీఎస్ఈలో ఇన్ఫీ షేర్ అంతర్గత ట్రేడింగ్ లో 2.87 శాతం నష్టపోయినా, ట్రేడింగ్ ముగిసే సమయానికి 0.63 శాతం నష్టంతో రూ.1411.60 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈలో ఇన్ఫీ షేర్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 2.85 శాతం పతనంతో రూ.1,378.75 వరకూ పడిపోయినా చివరకు 0.51 శాతం నష్టంతో రూ.1,411.95 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,655.37 కోట్లు నష్టపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సర మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ నికర లాభాల్లో 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ అంచనాలను 1-3 శాతానికి పరిమితం చేసింది.
రెండు రోజుల్లో నెస్లే ఎం-క్యాప్ రూ.10,610 కోట్లు లాస్

నెస్లే ఇండియా షేర్ల పతనం రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. గ్లోబల్ ఎఫ్ఎంసీజీ మేజర్ నెస్లే ఇండియా.. తన మిల్క్ ప్రోడక్ట్స్ లో చక్కెర శాతం ఎక్కువగా వాడుతుందని వార్తలు వచ్చాయి. దీంతో గురు, శుక్రవారాల్లో నెస్లే ఇండియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. బీఎస్ఈలో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో నెస్లే షేర్ 3.53 శాతం నష్టంతో రూ.2,375.75 వరకూ పతనమైనా, ముగింపు సమయానికి 1.04శాతం పతనంతో రూ.2,437.10 వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈలోనూ 2.13 శాతం పతనంతో రూ.2410కి పడిపోయినా, ముగింపు సమయానికి 1.32 శాతం నష్టంతో రూ.2430 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,610.55 కోట్లు నష్టంతో రూ.2,34,974.74 కోట్ల వద్దకు పడిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

