Infosys | కొత్త ఏడాది దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ (Infosys) తన ఉద్యోగులకు (employees) తీపి కబురు చెప్పనున్నట్లు తెలిసింది. అతి త్వరలో ఉద్యోగులకు వేతనాల పెంపును (rolling out pay hike) ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల నుంచే వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన లెటర్స్ ఫిబ్రవరిలో ఉద్యోగుల చేతికి అందుతాయని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ( job level 5) ఉద్యోగులకు అందుతుందని తెలిసింది. జాబ్ లెవల్ 6 ఆపై ఉన్న వారికి మార్చిలో వేతనాల పెంపుకు సంబంధించిన లేఖలు అందనున్నాయని తెలుస్తోంది. అయితే జీతాల పెంపు వార్తలపై ఇన్ఫోసిస్( Infosys) ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేఎల్5లో సాఫ్టువేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టం ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు.
Also Read..
Stocks | స్టాక్ మార్కెట్లు క్రాష్.. రూ.14లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..!
Standard Glass Lining | 26 శాతం ప్రీమియంతో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ లిస్టింగ్..!
Rupee | నేలచూపులు.. మరింత క్షీణించిన రూపాయి విలువ