బెంగళూరు, డిసెంబర్ 25: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఎంట్రిలేవల్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఎంట్రీలెవల్ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్టు, వార్షిక ప్రాతిపదికన వారికి రూ.21 లక్షల వరకు ప్యాకేజీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఎంట్రీలెవల్ ఉద్యోగులకు అత్యధికంగా వేతనం ఇస్తున్నది ఇన్ఫోసిస్ కావడం గమనార్హం. ప్రత్యేక టెక్నాలజీ రోల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ ఫ్రెషర్లకు రూ.7 లక్షల నుంచి రూ.21 లక్షల లోపు వేతనాన్ని అందిస్తున్నది.