ఇన్ఫీ అదుర్స్

- లాభం రూ.5809 కోట్లు
- ఆదాయం రూ.31,867 కోట్లు
- గైడెన్స్ 20 శాతానికి పెంపు
న్యూఢిల్లీ, జనవరి 12: సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు గైడెన్స్‌ను సైతం భారీగా పెంచింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 11.8 శాతం పెరిగి రూ.5,809 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్కంటే లాభం 7.7 శాతం వృద్ధిచెందింది. ఈ వృద్ధి 5 శాతం వరకూ ఉండవచ్చన్న విశ్లేషకుల అంచనాల్ని కంపెనీ అధిగమించింది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 19.5-20 శాతం పెరగవచ్చని తాజాగా గైడెన్స్ ఇచ్చింది. 2021 అక్టోబర్ నెలలో 16.5-17.5 శాతం గైడెన్స్‌ను ప్రకటించిన కంపెనీ ఈ దఫా దానిని గణనీయంగా పెంచింది. 17.5-18 శాతం గైడెన్స్‌ను మార్కెట్ అంచనావేస్తుండగా, దీనిని సైతం ఇన్ఫీ దాటడం గమనార్హం.
ఆదాయం 32వేల కోట్లు
- 2020 డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ రూ.5,197 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
- 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫీ ఆదాయం 22.9 శాతం వృద్ధిచెంది రూ. 31,867 కోట్లకు పెరిగింది. 2020 డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ.25,927 కోట్లు.
- నిర్వహణా లాభం రూ.7,484 కోట్లకు పెరిగింది. అయితే ఐటీ నిపుణులను నిలుపుకునేందుకు వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్ సెప్టెంబర్ త్రైమాసికంకంటే 10 బేసిస్ పాయింట్లు తగ్గి 23.5 శాతానికి దిగింది.
- కంపెనీ మొత్తం ఆదాయంలో డిజిటల్ రెవిన్యూ వాటా 2021 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 56.1 శాతం నుంచి 58.5 శాతానికి చేరింది.
- ఇన్ఫోసిస్‌కు 2.53 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌లు లభించాయి.
- ఐటీ వెర్టికల్స్‌లో మాన్యుఫాక్చరింగ్, లైఫ్ సైన్స్స్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసుల నుంచి ఆదాయ వృద్ధి జోరుగా ఉంది.
- ఆదాయం వృద్ధిలో ఉత్తర అమెరికా వాటా 21.3 శాతంకాగా, ఇండియా వాటా 38.4 శాతం ఉంది.
- కంపెనీ ఫలితాలు బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ షేరు ధర 1.16 శాతం వృద్ధితో 1,878 వద్ద ముగిసింది.
‘డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం క్లయింట్లు మాపై ఉంచిన అపారమైన విశ్వాసంతోనే ఈ పటిష్టమైన పనితీరును కనపర్చాం. మార్కెట్ వాటాను పెంచుకున్నాం’
–సలీల్ పారేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో
55 వేల ఫ్రెషర్లను నియమిస్తాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 55,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఒకవైపు ఐటీ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొనడం, 45,000 మంది ఫ్రెషర్ల నియమించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించగా, ఈ సంఖ్యను తాజాగా పెంచడం గమనార్హం.
భారీగా పెరిగిన వలసలు
డిసెంబర్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగుల వలసలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 20.1 శాతంగా ఉన్న వలసలు తాజాగా ముగిసిన క్వార్టర్లో 25.5 శాతానికి చేరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

