Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే, 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 15వాట్ల వైర్లెస్ చార్జింగ్ మద్దతుతో వస్తున్న ఫోన్ ధర రూ.17,999 నుంచి ప్రారంభం అవుతుంది. గత ఏప్రిల్ లోనే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G), ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేయడంతో రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ రూ.17,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇన్షియల్ సేల్‌లో భాగంగా రూ.2000 విలువైన మ్యాగ్ పాడ్ కూడా ఇస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ రెండు రంగులు – ఒబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 26 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఇన్ఫినిక్స్ ఓన్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. రెండేండ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ మూడేండ్లపాటు అందించనున్నది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), మరో రెండు 2-మెగా పిక్సెల్ మాక్రో, డెప్త్ సెన్సర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ 33వాట్ల చార్జింగ్ మద్దతు (బండిల్డ్ అడాప్టర్), 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, జేబీఎల్‌తో, సౌండ్‌తోపాటు డ్యుయల్ స్టీరియో సెటప్, డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ కలిగి ఉంటుంది.