Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో అందుబాటులోకి రానున్నదని తెలుస్తున్నది. ఇన్ఫినిక్స్ నోట్ 30 ఫోన్లో చాట్‌జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్.. యూజర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇందుకోసం ఓపెన్ ఏఐ – చాట్‌జీపీటీ ఆధ్వర్యంలో పని చేసే ఫొలాక్స్ స్మార్ట్ అసిస్టెంట్.. ఇన్ఫినిక్స్ నోట్ 30 ఫోన్లో అమర్చిన పలు యాప్స్‌లో భాగంగా ఉంటుంది. ఈ ఫోన్ 108-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో అందుబాటులోకి వస్తున్నదని తెలుస్తున్నది. ఈ ఫోన్ రూ.20,990లకు లభిస్తుందని సమాచారం.
అధికారికంగా ఇన్ఫినిక్స్ లాంచింగ్ తేదీ ప్రకటించకున్నా ఈ నెల ఏడో తేదీన మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ ఎంటర్ కావచ్చు. ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది. 108-మెగా పిక్సెల్, 2 -మెగా పిక్సెల్, 0.08 మెగా పిక్సెల్ సెన్సర్ లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.
ఒక్టాకోర్ (2.4 హెర్ట్జ్) మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్నది. 6.78 -అంగుళాల డిస్ ప్లే విత్ 1080 x 2460 పిక్సెల్ రిజొల్యూషన్ తో ఉంటుంది. 580 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. మ్యాజిక్ బ్లాక్, ఇంటర్ స్టెల్లార్ బ్లూ, సన్ సెట్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూమ్ ఆప్షన్లు ఉంటాయి.
డ్యుయల్ సిమ్, జీఎస్ఎం, 4జీ, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తున్నది. అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, లైట్ సెన్సార్, ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సెలోమీటర్, కంపాస్, గైరో స్కోప్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.