IndiGo | ఇండిగో ఫ్లీట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం ఎయిర్‌బస్‌కు మరో 30 వైడ్ బాడీ ఏ350 విమానాల కోసం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందంతో ఆ విమానాల సంఖ్య 60కి పెరగనున్నది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఇండిగో 30 ఏ350 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అదే రకమైన మరో 70 విమానాలను ఆర్డర్ చేసేందుకు ఓ ఆప్షన్ ఇచ్చింది. 70 విమానాల ఎంపికలో ఇప్పుడు 30 విమానాలకు ఆర్డర్ ఇస్తున్నట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన ఇండిగో తన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లీజుకు తీసుకున్న బోయింగ్ 787 విమానాలతో పది కొత్త విదేశీ నగరాలకు విమానాలను నడపడానికి సన్నాహాలు చేస్తున్నది.
GST Collections | మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2లక్షల కోట్లు.. గత ఏడాది కంటే 16శాతం పెరుగుదల..!
Bank Holidays in June | జూన్‌లో బ్యాంకులు పది రోజులు బంద్..! ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయంటే..?