IndiGo – Discounts | ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) తన ప్రయాణికులకు గెట్ వే (Getaway) సేల్ ప్రకటించింది. దేశీయ, విదేశీ రూట్లలో విమాన ప్రయాణ టికెట్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వచ్చే నెల 23 నుంచి ఏప్రిల్ 30 వరకూ విమాన ప్రయాణం చేసే వారు ఈ నెల 25 లోగా టికెట్ బుక్ చేసుకుంటే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.1,199 నుంచి, విదేశీ రూట్లలో విమాన ప్రయాణ టికెట్లు రూ.4,499 నుంచి ప్రారంభం అవుతాయి.
అదనపు బ్యాగేజీ (15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు) ఆప్షన్లతోపాటు 6ఈ యాడ్ ఆన్స్ మీద, స్టాండర్డ్ సీట్ సెలక్షన్, ఎమర్జెన్సీ ఎక్స్ఎల్ సీట్లపైనా ప్రయాణ టికెట్లకు డిస్కౌంట్ లభిస్తుంది. యాడ్ ఆన్స్‌లో దేశీయ రూట్లలో రూ.599, విదేశీ రూట్లలో రూ.699 నుంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉన్న ఇండిగో.. ఆ బ్యాంకు క్రెడిట్ కార్డులతో టికెట్ బుకింగ్స్ చేసుకుంటే అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది. ఈ నెల 31 లోపు బుకింగ్స్ చేసుకున్న ప్రయాణికులకు దేశీయ రూట్లలో 15 శాతం, విదేశీ రూట్లలో 10 శాతం రాయితీ ఇస్తామని ఇండిగో తెలిపింది. ఆసక్తి గల ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్‌కి వెళ్లి బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది.