న్యూఢిల్లీ, జూన్ 24: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మాన్సూన్ సేల్’ పేరుతో దేశీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది. ఈ నెల 29 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూలై 1 నుంచి సెప్టెంబర్ 21లోపు ఎప్పుడైనా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ కింద ఒకవైపు దేశీయ ప్రారంభ విమాన టికెట్ ధర రూ.1,499గాను, అంతర్జాతీయ రూట్లో రూ.4,399గా నిర్ణయించింది. అలాగే బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 9,999 ప్రారంభ ధరతో అందిస్తున్నది సంస్థ. దీంతోపాటు ప్రీ-పెయిడ్ బ్యాగేజీ చార్జీలపై కూడా 50 శాతం రాయితీ ఇస్తున్నది.