హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు..
హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్రకటించింది.
- డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించనున్న ఇండిగో
హైదరాబాద్, అక్టోబర్ 27:హైదరాబాద్ విమానాశ్రయం మరో రెండు అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ఇండిగో శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రం నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్టు తెలిపింది. వీటిలో హైదరాబాద్-సింగపూర్ల మధ్య సర్వీసులు ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) చేరుకోనున్నది.
తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు అర్ధరాత్రి 1.30 గంటలకు చేరుకోనున్నది. అలాగే వచ్చే నెల 3 నుంచి హైదరాబాద్-కొలంబోల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు అందుబాటులోకి రానున్నది. 6ఈ-1181 నంబర్ కలిగిన ఇండిగో విమాన సర్వీసు హైదరాబాద్ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నాం 2 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నాం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నది. ఈ నాన్-స్టాప్ ఫ్లైట్ సర్వీసు వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

