Crude Oil | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి భారతదేశానికి ఒపెక్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి చమురు తగ్గుతూ వస్తున్నది. చౌక ధరకే రష్యా సరఫరా చేస్తుండటంతో గత నెలలో ఒపెక్ దేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతి ఆల్ టైం కనిష్ట స్థాయి 46 శాతానికి పడిపోయింది. గతేడాది ఏప్రిల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) దేశాల నుంచి 72 శాతం ముడి చమురు సరఫరా జరిగింది.
గత నెలలో ఒపెక్ దేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతి 46 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి ముందు వరకు ఒకానొక దశలో 90 శాతం ఒపెక్ దేశాలు భారత్కు క్రూడాయిల్ సరఫరా చేశాయి. కానీ, గత నెలలో రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 4.6 మిలియన్ బీపీడీల ముడి చమురు సరఫరా చేశాయి ఒపెక్ దేశాలు. గత నెలలో రష్యా నుంచి ప్రతి రోజు 1.67 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు చొప్పున 36 శాతం దిగుమతి చేసుకున్నది.
ప్రస్తుతం భారతదేశానికి అత్యధికంగా క్రూడాయిల్ సరఫరా చేస్తున్న దేశంగా రష్యా కొనసాగుతున్నది. రష్యా నుంచి వరుసగా ఏడో నెల మూడోవంతుకు పైగా భారత్ క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నది. గత దశాబ్ధి కాలంలో ఇరాక్, సౌదీ అరేబియాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ కంటే ఎక్కువగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి అవుతున్నది.