న్యూఢిల్లీ: ఇండియాలో బంగారం(Gold) కొనుగోళ్లు పడిపోయాయి. పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు తేలింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారానికి సుమారు 15 శాతం డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు పేర్కొన్నది. ఆ త్రైమాసికంలో గోల్డ్ సేల్స్ 118.1 టన్నులకు పడిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధరి లక్ష వరకు ఉన్నది. డబ్ల్యూజీసీ అంచనాల ప్రకారం ఈ యేడాది బంగారం డిమాండ్ 700 నుంచి 800 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాదిలో బంగారం ధర 25 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారానికి లక్ష చేరిందన్న గుబులు కొనుగోలుదార్లకు పట్టుకున్నది. అయితే అక్షయ తృతీయ సందర్భంగా బంగారం సేల్స్ బాగున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ తెలిపారు. పుత్తడి ధర పెరగడంతో కొందరు దాన్ని కొనేందుకు వెనుకాడుడ్తున్నారు.
Gold has had an impressive start to 2025 – the Q1 figures are in, and amid record prices, it was the strongest first quarter for total demand since 2016. Get the data in #GoldDemandTrends: https://t.co/VHhYznnbeq pic.twitter.com/l5RbReRAeQ
— World Gold Council (@GOLDCOUNCIL) April 30, 2025