ముంబై, డిసెంబర్ 16: విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.908 బిలియన్ డాలర్లు పెరిగి 564.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
అంతక్రితం వారంలోనూ రిజర్వులు 11 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. వరుసగా ఐదో వారంలోనూ రిజర్వులు పెరగడం విశేషం. అక్టోబర్ 2021లో రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న రిజర్వులు ఆ తర్వాత 100 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయాయి.