Forex Reserves | దేశీయ ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో మరో జీవిత కాల గరిష్ట రికార్డు నమోదైంది. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 9.69 బిలియన్ డాలర్లు పెరిగి 666.85 బిలియన్ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఆర్బీఐ విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ గణాంకాల ప్రకారం ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 2.57 బిలియన్ డాలర్లు పెరిగి 588.05 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు 1.32 బిలియన్ డాలర్ల వృద్ధితో 59.99 బిలియన్ డాలర్లకు చేరుకుంటే ఎస్డీఆర్లు కూడా 95 మిలియన్ డాలర్ల వృద్ధితో 18.20 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ నిల్వలు 4.60 బిలియన్ డాలర్లుగా యధాతథంగా కొనసాగుతున్నాయి.
Gold-Silver Rates | స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు.. మూడు సెషన్లలో రూ.5000 తగ్గిన పుత్తడి
iPhone | ఐ-ఫోన్లపై బంపరాఫర్.. గణనీయంగా ధరలు తగ్గించిన ఆపిల్..!
Hyundai Creta – 2024 | హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ సరికొత్త రికార్డు.. అదేమిటంటే..!