ముంబై, డిసెంబర్ 23: వరుసగా ఐదు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతక్రితం వారంలో రిజర్వులు 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 564.06 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పడిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. గతవారానికిగాను 500 మిలియన్ డాలర్లు తగ్గి 499.624 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే పసిడి రిజర్వులు 150 మిలియన్ డాలర్లు తరిగిపోయి 40.579 బిలియన్ డాలర్లకు జారుకున్నాయి.