Forex Reserve | భారత్ విదేశీ మారక ద్రవ్యం (Forex Reserve) నిధులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు రెండో తేదీతో ముగిసిన వారంలో 7.533 బిలియన్ డాలర్లు పెరిగి 674.919 బిలియన్ డాలర్ల జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పెరిగిన సంగతి తెలిసిందే.
ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 4.079 బిలియన్ డాలర్లు తగ్గి 587.96 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం రిజర్వ్ నిల్వలు సైతం 860 మిలియన్ డాలర్ల నష్టంతో 59.239 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 121 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 18.282 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 18 మిలియన్ డాలర్లు పెరిగి 4.638 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!