Forex Reserves | గత నెల 25తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 3.463 బిలియన్ల డాలర్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 684.805 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ విడుదల చేసిన డేటా పేర్కొంది. సెప్టెంబర్ నెలాఖరులో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఫారిన్ కరెన్సీ అసెట్స్ 4.484 బిలియన్ డాలర్లు తగ్గి 593.751 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
బంగారం రిజర్వు నిల్వలు 1.082 బిలియన్ డాలర్లు తగ్గి 68.527 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 52 మిలియన్ డాలర్లు పడిపోయి 18.219 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 9 మిలియన్ డాలర్లు తగ్గి 4.307 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.