ముంబై, జూలై 5: విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. జూన్ 28తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.713 బిలియన్ డాలర్లు తరిగిపోయి 651.997 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతక్రితం వారంలోనూ రిజర్వులు 2.922 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. గతవారంలో ఈ ఆస్తులు 1.252 బిలియన్ డాలర్లు తగ్గి 572.881 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి రిజర్వులు 56.528 బిలియన్ డాలర్లకు చేరాయి.