ముంబై, నవంబర్ 24: క్రమంగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 17తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.077 బిలియన్ డాలర్లు పెరిగి 595.397 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 462 మిలియన్ డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరగడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. గత వారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 4.387 బిలియన్ డాలర్లు ఎగబాకి 526.391 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదేకాలంలో పసిడి రిజర్వులు 527 మిలియన్ డాలర్లు పెరిగి 46.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.