Electronics Price Hike | ఎలక్ట్రానిక్‌పై స్మార్ట్‌గా బాదుడు.. ఫోన్లు, టీవీలు, ఏసీ ధరలు భారీగా పెంపు!
Electronics Price Hike | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. జీఎస్టీ రేటు తగ్గడంతో భారీ ఉపశమనం పొందిన కస్టమర్లకు యుద్ధం గట్టి షాకిచ్చింది.
Electronics Price Hike | న్యూఢిల్లీ, మార్చి 31: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఎలక్ట్రానిక్స్ పరికరాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. జీఎస్టీ రేటు తగ్గడంతో భారీ ఉపశమనం పొందిన కస్టమర్లకు యుద్ధం గట్టి షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు అన్ని రకాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగబోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఏసీ, వాషింగ్ మెషిన్ల ధరలు 10 శాతానికి పైగా పెంచడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం కారణంగా తమపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను సవరించాల్సి వస్తున్నదని సంస్థలు ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వివో, ఒప్పో, సామ్సంగ్, షియోమీలు తమ మాడళ్ల ధరలను 10 శాతం వరకు పెంచుతున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చాయి.
ఎనిమిదేండ్ల నాటికి ధరలు..
మళ్లీ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు ఆరు నుంచి ఎనిమిదేండ్ల కిందటి స్థాయికి చేరుకోబోతున్నాయి. దశాబ్దకాలం క్రితం స్మార్ట్‌ఫోన్, టీవీలు, ఏసీల ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండేవి. ఆ తర్వాత కాలంలో టెక్నాలజీ రంగంలో వచ్చిన పెనుమార్పులకు తోడు దేశీయ తయారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్‌తో వీటి ధరలు భారీగా పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే స్థాయికి చేరుకోనున్నాయి. వచ్చే నెలలో ధరల గరిష్ఠ స్థాయిలో పెరుగనున్నాయని గోద్రెజ్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు.
ధరలు పెరుగడానికి కారణాలు
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
- గడిచిన ఆరు నెలల్లో చిప్‌ల ధరలు గణనీయంగా పెరుగడం
- రూపాయి కనిష్ఠ స్థాయికి పడిపోవడం
- నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగడం
- క్రూడ్ ధరలు భగ్గుమనడం
పలు గ్లోబల్ బాండ్లు తమ ఉత్పత్తుల ధరలను పది శాతం వరకు పెంచబోతున్నాయి. వచ్చే జూన్ నాటికి 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20 వేలకు చేరుకోనున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. భవిష్యత్తులో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ట్రేడ్ ప్రమోషన్లకు చెక్పడే అవకాశాలు ఉన్నాయి.
– కైలాష్ లక్ష్యాని, ఆల్ ఇండియా మొబైల్
రిటైలర్స్ అసోసియేషన్ చైర్మన్
5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు ఇలా..
- గత దీపావళి నాటికి రూ.10 వేల లోపు ఉన్న 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ధరలు ప్రస్తుతం రూ.13-14 వేల మధ్యలోకి చేరాయి.
- వచ్చే త్రైమాసికంలో వీటి ధరలు రూ.17 వేల నుంచి రూ.18 వేల మధ్యలోకి చేరుకోనున్నాయి.
- ఇదే క్రమంలో వీటి ధరలు 2020-21 స్థాయికి చేరుకోనున్నాయి.
- వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ ధరలు రూ.20 వేలకు చేరుకోవచ్చునని అంచనా.
టెలివిజన్ ధరలు..
- ఏడాది క్రితం రూ.6,500గా ఉన్న 32 ఇంచుల స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.8,500 స్థాయికి చేరుకున్నది.
- మే నెలలో ఈ టీవీ ధర రూ.10 వేలకు చేరుకుంటుందని అంచనా. 2017-18లో ఇదే స్థాయిలో ధర ఉండేది.
ఏసీల ధరల పెరుగుదల..
- 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన 3-స్టార్ ఏసీ ధరలు రూ.37 వేల నుంచి రూ.40 వేల మధ్యలోకి చేరుకోనున్నాయి.
- గతేడాది వేసవికాలంలో వీటి ధరలు రూ.32 వేల నుంచి రూ.34 వేల మధ్యలో ఉండేవి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

