మూడోరోజూ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 633, నిఫ్టీ 196 పాయింట్లు వృద్ధి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ మదుపరులు మాత్రం కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజూ బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి.
ముంబై, మార్చి 18 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ మదుపరులు మాత్రం కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజూ బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు ర్యాలీకి తోడయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 633.29 పాయింట్లు అందుకొని 76,704.13 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 196.65 పాయింట్లు ఎగబాకి 23,777.80 పాయింట్లకు చేరుకున్నది.
9 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో మదుపరులు సంపద అమాంతం పెరిగింది. వరుసగా మూడు రోజుల్లో వీరి సంపద రూ.9 లక్షల కోట్లకు పైగా ఎగబాకింది. గత మూడు సెషన్లలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,140.21 పాయింట్లు లేదా 2.87 శాతం బలపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.9,18,579.57 కోట్లు బలపడి రూ.4,39,00,831 కోట్లు(4.75 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

