ముంబై, ఏప్రిల్ 20 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో కదలాడాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 26.76 పాయింట్లు అందుకొని 78,520.30 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 11.30 పాయింట్లు పెరిగి 24,364.85 వద్ద ముగిసింది.
ట్రెంట్, ఎస్బీఐ, ఏషియన్ పెయిం ట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు లాభాల్లో ముగియగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 4.14 శాతం ఎగబాకి 94.12 డాలర్లకు చేరుకోవడం మదుపర్లలో ఆందోళనను పెంచిందని, ఫలితంగా ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.