Stock Mmarkets | ముంబై, నవంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. అదానీ దెబ్బకు గురువారం భారీగా నష్టపోయిన సూచీలు ఆ మరుసటి రోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 79 వేల మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 1,961.32 పాయింట్లు లేదా 2.54 శాతం లాభపడి 79,117.11 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 557.35 పాయింట్లు లేదా 2.39 శాతం లాభపడి 23,907.25 వద్ద స్థిరపడింది. సూచీలు కదంతొక్కడంతో మదుపరుల సంపద లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.7,32,144.04 కోట్లు పెరిగి రూ.4,32,71,052.05 కోట్లు(5.12 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ
పార్టీ విజయం సాధించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ మదుపరుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని, కోలుకున్న అదానీ గ్రూపు షేర్లు అదానీ గ్రూపునకు చెందిన ఆరు కంపెనీల షేర్లు లాభ పడగా, నాలుగు సంస్ధల షేర్లు నష్టపోయాయి. అంబుజా సిమెంట్ షేరు 3.50 శాతం లాభపడగా, ఏసీసీ షేరు 3.17 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.16 శాతం, అదానీ పోర్ట్స్ 2.05 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.18 శాతం, ఎన్డీటీవీ షేరు లాభాల్లోకి వచ్చాయి. మరోవైపు అదానీ గ్రూపు సంస్థలు వివరణ ఇవ్వాలని స్టాక్ ఎక్సేంజ్‌లు సూచించాయి.