హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంబీఏ కాలేజీల జాబితాలో టాప్-5 ర్యాంక్ సాధించింది. ఈ విషయాన్ని లింక్డిన్ తాజా సర్వేలో వెల్లడైంది. వరుసగా మూడో ఏడాది టాప్-100 గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో గతేడాది ఆరో స్థానంలో నిలిచిన ఐస్బీ..ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది.
అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్ తన స్థానాన్ని 19వ ర్యాంక్ నుంచి 17 ర్యాంక్‌కు పెంచుకున్నది. ఈ జాబితాలో నూతనంగా ఐఐఎం కొల్కతా 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఐఐఎం బెంగళూరుకు 20వ స్థానం లభించింది.