Adani-Nikkei Asia |యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ `హిండెన్‌బర్గ్ రీసెర్చ్` నివేదికతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజురోజుకు పతనమవుతున్నది. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక దరిమిలా అదానీ గ్రూప్ బాండ్ల తాకట్టుకు ససేమిరా అన్నాయి క్రెడిట్ సూయిజ్, సిటీ గ్రూప్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు. అదానీ సంస్థల నుంచి నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ పూర్తిగా బయటకొచ్చేసింది. నాలుగు సంస్థలకు మూడీస్ నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. మోర్గాన్ స్టాన్లీ వెయిటేజీ తగ్గించింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల ఆస్తులు, రుణాలపై నిక్కీ ఆసియా విశ్లేషించింది. అదానీ గ్రూప్ సంస్థల రుణాల్లో 40 శాతం భారత బ్యాంకులవేనని పేర్కొంది.