సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 26, 2020 , 00:18:10

ఇండియన్‌ బ్యాంక్‌ గోల్డ్‌ లోన్లు ఆకర్షణీయం

ఇండియన్‌ బ్యాంక్‌ గోల్డ్‌ లోన్లు ఆకర్షణీయం

  • రైతులకు వడ్డీ 7 శాతమే

ముంబై: బంగారం రుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండియన్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించింది. రైతులకు 7 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తామని ఓ ప్రకటనలో తెలియజేసింది. స్వల్పకాలిక పసిడి రుణ పథకం ‘బంపర్‌ అగ్రీ జ్యుయెల్‌'పై వడ్డీరేటును 7.5 శాతం ఉంచి 7 శాతానికి దించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులకు ఊరటనిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఈ నెల 22 నుంచే వడ్డీరేట్ల తగ్గింపు వర్తిస్తుందని, లక్ష రూపాయల రుణంపై రూ.583 వడ్డీనే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది. తనఖా పెట్టిన బంగారు నగల విలువలో 85 శాతం రుణంగా పొందవచ్చని చెప్పింది. అయితే 6 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 


logo