ADB Loan | ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వద్ద కేంద్ర ప్రభుత్వం 98 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నది. హార్టికల్చర్ పంటల దిగుబడి పెంపు కోసం కేంద్రం ఈ రుణం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ప్రకటించింది. హార్టికల్చర్ పంటల దిగుబడి పెంపునకు.. ఆయా పంటలకు చీడ పీడల నివారణకు ఈ రుణం ఉపయోగిస్తామని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘బిల్డింగ్ ఇండియా’స్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ అనే అంశంపై జరిగిన ఒప్పందం మీద ఆర్థిక శాఖ ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి జుహీ ముఖర్జీ, ఏడీబీ ఇండియా ప్రతినిధి కైవై యేయో సంతకాలు చేశారు. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జూహీ ముఖర్జీ స్పందిస్తూ.. ‘రైతులకు ఆరోగ్యకరమైన పంటల దిగుబడి పెంచడానికి ఏడీబీ నిధులను వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు. భారత్ ఆత్మ నిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (సీపీపీ) కింద ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఏడీబీ ప్రతినిధి కైవే యేయో తెలిపారు.