Jewellery | కొన్ని తరహా బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద మాత్రం మినహాయింపు ఉంటుంది. పెరల్స్, డైమండ్స్, ప్రీసియస్, సెమీ ప్రీసియస్ రాళ్లు గల బంగారం ఆభరణాలను ఇక నుంచి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ లో వెల్లడించింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. తక్షణం ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం బంగారం దిగుమతిపై 15 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది.