చెన్నై, డిసెంబర్ 24: ఫార్మసీ వరల్డ్‌గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
ఆఫ్రికాలో వినియోగిస్తున్న జనరల్ మెడిసిన్‌లో 50 శాతం ఇక్కడి నుంచి ఎగుమతవుతున్నయేనని, అలాగే 40 శాతం అమెరికాకు, బ్రిటన్ దేశాలకు 25 శాతం అవుతున్నాయని 35వ వార్షిక సదస్సులో మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో భారత్ 60 శాతం ప్రొడ్యుస్ చేస్తున్నదని మంత్రి చెప్పారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతున్నదన్నారు. మెడికల్ టూరిజం శరవేగంగా దూసుకుపోతున్నదన్నారు.