Crude Oil | ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకున్నది. కానీ పరిస్థితులు మారినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సుకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలయని తెలుస్తున్నది.
భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యా ఆయిల్ మేజర్ రోస్ నెఫ్ట్ తదితర ప్రాంతాల నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకున్నది. చెల్లింపుల సమస్యతో కొరత తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వర్గాలు తెలిపాయి.
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది.