బుధవారం 03 జూన్ 2020
Business - Apr 27, 2020 , 18:06:06

వృద్ధి రేటు 1.9శాత‌మేః ఇండ్ రా

వృద్ధి రేటు 1.9శాత‌మేః ఇండ్ రా

క‌రోనా సంక్షోభం కార‌ణంగా భార‌త ఆర్థిక వృద్ధిరేటు దాదాపు మూడు ద‌శాబ్దాల నాటికి ప‌డిపోనుద‌ని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) తెలిపింది. 2020-2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధిరేటు కేవ‌లం 1.9శాత‌మే ఉండ‌నుంద‌ని, గ‌త 29 ఏండ్ల‌లో ఇదే అతి త‌క్కువ అని పేర్కొంది. మే 3వ‌ర‌కు లాక్‌డౌన్ కేంద్రం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వ‌చ్చే నెల మ‌ధ్య‌వ‌ర‌కు పాక్షిక లాక్‌డౌన్ కొన‌సాగ‌వ‌చ్చ‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని వృద్ధిరేటు స‌వ‌రించిన అంచ‌నాల‌ను విడుద‌ల‌చేసిన‌ట్లు ఈ రేటింగ్ సంస్థ త‌న రిపోర్టులో సోమ‌వారం వెల్ల‌డించింది. మార్చి 30న ఈ సంస్థ విడుద‌ల చేసిన నివేదిక‌లో ఈ ఏడాది వృద్ధిరేటు 3.5శాతంగా ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. 


logo