హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : టన్ను బొగ్గును కనీసం వెయ్యి రూపాయలకు అందించేలా ఉత్పాదతకను పెంచడంతోపాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ అధికారులకు దిశానిర్ధేశనం చేశారు. సంస్థ జీఎంలు, డిప్యూటీ జీఎంలతో సీఎండీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు.
సంస్థ పరిధిలోని పాత గనులు మూతబడుతున్న నేపథ్యంలో ఒడిశాలోని నైనీ, కొత్తగూడెంలోని వీకేవోసీ, ఇల్లందులోని జేకేవోసీ, బెల్లంపల్లిలోని గోలేటీ ఓసీల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నామన్నారు. తద్వా రా 20 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తిని సాధించగలమనే ధీమాను ఆయన వ్యక్తంచేశారు. ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాక్లు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.