అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారంలు
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 మదింపు సంవత్సరం)గాను వ్యక్తులు (వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు), నిపుణులు, చిరు వ్యాపారులు ఆన్లైన్లో దాఖలు చేసుకునేందుకు ఐటీ రిటర్న్ 1, 4 ఫారంలను అందుబాటులోకి తెచ్చింది. ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఐటీఆర్-1, ఐటీఆర్-4లను దాఖలు చేసుకోవచ్చని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖ బదులిచ్చింది.
న్యూఢిల్లీ, మే 23: ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 మదింపు సంవత్సరం)గాను వ్యక్తులు (వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు), నిపుణులు, చిరు వ్యాపారులు ఆన్లైన్లో దాఖలు చేసుకునేందుకు ఐటీ రిటర్న్ 1, 4 ఫారంలను అందుబాటులోకి తెచ్చింది. ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఐటీఆర్-1, ఐటీఆర్-4లను దాఖలు చేసుకోవచ్చని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ఐటీ శాఖ బదులిచ్చింది.
మిగతా ఐటీఆర్ ఫారాల దాఖలుకు త్వరలోనే వస్తాయని వివరించింది. కాగా, ఐటీఆర్-1ను ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించారు. ఐటీఆర్-4ను రూ.50 లక్షల వార్షిక ఆదాయం మించకుండా, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ను ఎంచుకున్న వ్యాపారులు, వృత్తి నిపుణుల కోసం ఉద్దేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ ఏడాది జూలై 31. అయితే ఆడిటింగ్ అవసరం లేనివారికే ఈ గడువు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

