Income Tax | న్యూఢిల్లీ, జూన్ 17: వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు మారనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నది. మధ్యతరగతి వేతన జీవులకు ఊరటనిచ్చేలా పన్ను రేట్లలో మార్పులు చేయవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మార్కెట్లో వినిమయ శక్తిని పెంపొందించాలన్న కోణంలోనూ దీన్ని మోదీ సర్కారు పరిశీలిస్తున్నట్టు సమాచారం. వార్షిక ఆదాయం రూ.10 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఉన్నవారికి, ఆపై ఆదాయమున్న వర్గాలకు ఊరటనిచ్చేలా పన్ను రేట్లను తగ్గిస్తారన్న ఊహాగానాలున్నాయి.