మోదీ రాగానే.. సైడ్ ట్రాక్!
అదానీ గ్రూప్‌లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- 2014లోనే సెబీకి అదానీ అక్రమాల సమాచారం?!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్‌లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ ఉదంతంపై డెడ్‌లైన్ కంటే ముందే నివేదికను సమర్పించినప్పటికీ, సెబీ వాయిదాలు అడగడం, హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాతనే అదానీ కంపెనీలపై నిఘా పెట్టినట్టు కోర్టులో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, అదానీ గ్రూప్‌లో విదేశీ డొల్ల కంపెనీల పెట్టుబడులకు సంబంధించి 2014 జనవరిలోనే సెబీకి సమాచారం ఉన్నదని, ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అప్పటి హెడ్ నజీబ్ షా ఇదే అంశంపై సెబీకి లేఖ రాసినట్టు ఓసీసీఆర్పీ పేర్కొంది. అయితే, 2014 మేలో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఈ విషయం మరుగునపడిపోయినట్టు
తెలిపింది.
ఏ నివేదిక.. ఏమని ఆరోపించింది?

Hindenburg
సంస్థ పేరు: హిండెన్‌బర్గ్
ఏర్పాటు: 2017
వ్యవస్థాపకుడు: నాథన్ ఆండర్సన్
పనిచేసే కేంద్రం: అమెరికా
నివేదిక టైటిల్: హౌ ద వరల్డ్స్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇజ్ పుల్లింగ్ ది లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ.
ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యులు స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డారు. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారు. అప్పుల కోసం అడ్డదారులు తొక్కారు.
ఆరోపించిన తేదీ: జనవరి 24, 2023

Occrp
సంస్థ పేరు: ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్
ఏర్పాటు: 2006
వ్యవస్థాపకులు: డ్రూ సులీవన్, పౌల్ రాడూ
పనిచేసే కేంద్రం: అమెరికా
నివేదిక టైటిల్: డాక్యుమెంట్స్ ప్రొవైడ్ ఫ్రెష్ ఇన్సైట్ ఇన్‌టూ అలిగేషన్స్ ఆఫ్ స్టాక్ మ్యానిప్యులేషన్ దట్ రాక్డ్ ఇండియాస్ పవర్ఫుల్ అదానీ గ్రూప్
ప్రధాన ఆరోపణ: అదానీ గ్రూప్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయి. భారత చట్టాలను ఉల్లంఘించే విధంగా అదానీ గ్రూప్‌లోని ప్రమోటర్లకు అత్యంత సన్నిహితులు స్టాక్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టి, కృత్రిమంగా దాని విలువను భారీగా పెంచారు.
ఆరోపించిన తేదీ: ఆగస్టు 31, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Adani Group
- OCCRP
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

