లక్నో : ఐఐఐటీ లక్నో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అభిజిత్ ద్వివేదికి రూ 1.2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్ నుంచి జాబ్ ఆఫర్ లభించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్ డబ్లిన్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా అభిజిత్ ద్వివేది రికార్డుస్ధాయి ప్యాకేజ్ దక్కించుకున్నాడు.
ఐఐఐటీ లక్నో చరిత్రలోనే గత వేతన ప్యాకేజ్‌ల రికార్డులను ప్రయాగరాజ్‌కు చెందిన ద్వివేది చెరిపేశాడు. కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో ఐఐఐటీ లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్లతో నూరు శాతం ప్లేస్మెంట్ సాధించారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో వార్షిక సగటు వేతనం రూ 26 లక్షలు పలికింది.
ఇక ఇదే నెలలో ఎన్ఐటీ పట్నా స్టూడెంట్ అదితి తివారీ రూ 1.6 కోట్ల వార్షిక ప్యాకేజ్‌ను దక్కించుకుంది. జనవరిలో మరో బిహార్ విద్యార్ధి రూ 1.10 కోట్ల ప్యాకేజ్‌తో టెక్ దిగ్గజం గూగుల్ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. 2021 జులైలో హర్యానా రైతు కొడుకు అమెజాన్‌లో రూ 67 లక్షల వార్షిక వేతనంతో జాబ్ దక్కించుకున్నాడు.