IICMA | ఐస్‌క్రీం.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎండ, వాన, చలి.. ఇలా ఏ కాలమైనా సరే ఐస్‌క్రీం తినకమానరు. అయితే, ప్రస్తుతం దుకాణాలు లేదా పార్లర్ల ద్వారా విక్రయించే ఐస్ క్రీంపై జీఎస్టీ రేటు (GST) 18%గా ఉంది. ఈ నేపథ్యంలో ఐస్‌క్రీం కంపెనీలు జీఎస్టీ రేటును తగ్గించాలంటూ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇండియన్ ఐస్‌క్రీం తయారీదారుల సంఘం (IICMA) ప్రతినిధులు ఇవాళ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిని కలిశారు. ఐఐసీఎమ్ఏ అధ్యక్షుడు సుధీర్ షా నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజును కలిసింది. ఈ మేరకు ఐస్‌క్రీంపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరింది. అంతకుముందు ఈనెల 15న ఈ బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసింది. జీఎస్టీ తగ్గింపుపై నిర్మలమ్మకు పలు విజ్ఞప్తులు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో పోస్టు కూడా చేశారు.
Delegation of Indian Ice Cream Manufacturers’ Association (IICMA), led by its President Shri Sudhir Shah, calls on Smt @nsitharaman. pic.twitter.com/elVIzFmlRg
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) April 15, 2025
Also Read..
Naxals Arrest: 22 మంది నక్సల్స్ అరెస్టు, పేలుడు పదార్ధాలు స్వాధీనం
Robert Vadra | వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా