నూఢిల్లీ, ఆగస్టు 20: డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్ మరో ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు 375 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 7.75 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు తెలిపింది. ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ డిపాజిట్ స్కీం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉండనున్నదని బ్యాంక్ పేర్కొంది. ఈ స్కీం బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా బ్యాంక్‌నకు సంబంధించి ఏదైనా బ్రాంచ్‌లో ప్రారంభించుకోవచ్చునని సూచించింది.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రిజర్వు బ్యాంకు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్విజ్‌ను నిర్వహిస్తున్నది. జాతీయ స్థాయిలో క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఇందుకు సంబంధించి కళాశాలలవారీగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలుగా నిర్ణయించింది. వివరాలకు ttps://www.rbi90quiz.in సంప్రదించాలని సూచించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: కిమ్స్‌లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా 7.75 లక్షల షేర్లను రూ.184 కోట్ల కు కొనుగోలు చేసింది. దీంతో కిమ్స్‌లో ఎస్బీఐ లైఫ్ వాటా మరో 0.97 శాతం పెరిగినట్లు అయింది.