కోల్కతా, జూన్ 18: ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ అంచనాను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తమ తాజా ఔట్లుక్లో 6.2 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇది 6.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) గ్రోత్ అంచనాను కూడా 6.4 శాతం నుంచి 6 శాతానికి కుదించింది. ఇక ద్రవ్యోల్బణం విషయానికొస్తే.. రిటైల్ ద్రవ్యోల్బణం 3.5 శాతానికిపైనే ఉంటుందని, టోకు ద్రవ్యోల్బణం 1.8 శాతంపైనే ఉండొచ్చని చెప్పింది. ద్రవ్యలోటు 4.4 శాతంగా, కరెంట్ ఖాతా లోటు 1.2-1.3 శాతంగా ఉంటుందన్నది.