ICICI | ముంబై, సెప్టెంబర్ 28: ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 16పై ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నది. ఐఫోన్ 16ని కొనుగోలు చేసినవారికి రూ.5 వేల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చునని తెలిపింది. అలాగే ఈఎంఐ ఆప్షన్లో నెలకు రూ.2,497 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచించింది.
ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. పాత ఐఫోన్ కలిగివున్నవారు అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన వారికి క్యాష్‌బ్యాక్‌తోపాటు వడ్డీరహిత ఈఎంఐని ఎంచుకోవచ్చునని సూచించింది.
ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 మాడళ్లకు వర్తించనున్నది. ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లు అప్ట్రానిక్స్, యూనికార్న్, క్రోమా, రిలయన్స్, విజయ సేల్స్, సంగీత మొబైల్స్‌లో లభించనున్నది.