ముంబై, ఏప్రిల్ 16: ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభించనున్నది.
అంతకుముందు ఇది 3 శాతంగా ఉండేది. అలాగే రూ.50 లక్షలకు పైగా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం కోత పెట్టడంతో వడ్డీరేటు 3.25 శాతానికి దిగొచ్చింది. తగ్గించిన రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.