Hyundai | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) కార్ల ధరలు పెరుగనున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి వివిధ సెగ్మెంట్లు, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.25 వేలు పెరుగుతుందని గురువారం హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇన్ పుట్ కాస్ట్, మారకం విలువ, అధిక లాజిస్టిక్ ఖర్చులతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ముఖ్యంగా 2025 నుంచి మార్కెట్లోకి వచ్చే అన్ని మోడల్ కార్లపై ప్రభావం ఉంటుంది.
సాధ్యమైనంత వరకు కార్ల తయారీ ఖర్చును సర్ధుబాటు చేసినా, కొద్ది మొత్తం కస్టమర్లపై మోపక తప్పడం లేదని హ్యుండాయ్ మోటార్ ఇండియా హోల్ టైం డైరెక్టర్ కం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం హ్యుండాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధర రూ.5.92 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఎలక్ట్రిక్ ఐయానిక్ 5 కారు ధర రూ.46.05 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.