Hyundai CNG Car | ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశ్నానంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు పర్యావరణం దెబ్బ తింటున్నది. దీనికి ఆల్టర్నేటివ్గా సీఎన్జీ (CNG) లేదా ఈవీ (EV) కార్ల తయారీ వైపు మళ్లుతున్నాయి ప్రధాన కార్ల తయారీ సంస్థలు. తొలుత టాటా మోటార్స్ (Tata Motors).. తాజాగా ఆ బాటలోనే ప్రయాణిస్తోంది దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ (Hyundai) అనుబంధ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India).
దేశీయ కార్ల మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు హ్యుండాయ్ (Hyundai) తన సీఎన్జీ పవర్డ్ (CNG Powered) కార్లలో డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ కార్లు వెలుగులోకి వస్తే కస్టమర్లకు ఫ్యుయల్ ఖర్చు తగ్గడంతోపాటు బూట్ స్పేస్ కూడా పెరుగుతుంది. పొడవైన సింగిల్ సిలిండర్ కమర్షియల్ కార్లతో పోలిస్తే రెండు స్మాల్ సీఎన్జీ సిలిండర్ కార్లు సొంతం చేసుకోవచ్చు.
హ్యుండాయ్ తన డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీ కార్లకు హ్యు-సీఎన్జీ (Hy-CNG), హ్యూ-సీఎన్జీ డ్యూ (Hy-CNG Due) అనే పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా వీటి పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. ఏడాది క్రితం టాటా మోటార్స్ (Tata Motors) కూడా తన టాప్ మోడల్ కార్లు ఆల్ట్రోజ్ (Altroz), టియాగో (Tiago), పంచ్ (Punch), టైగోర్ (Tigor) మోడల్ కార్లలో ప్రయోగాత్మకంగా డ్యుయల్ సీఎన్జీ సిలిండర్ (Dual CNG Cylinder Technology) టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. కానీ హ్యుండాయ్ (Hyundai) కేవలం మూడు మోడల్ కార్లలో మాత్రమే ఫ్యాక్టరీ ఫిట్ సీఎన్జీ కిట్ ఆఫర్ చేసింది. టెక్నాలజీ ఫీచర్లు గల ఎక్స్టర్ (Exter), ఔరా (Oura) లతోపాటు హాట్ సెల్లింగ్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios)లో ఈ కిట్లు అందిస్తోంది.
భారత్ మార్కెట్లోని సీఎన్జీ కార్లలో అత్యంత చౌక కారుగా హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyunda Grand i10 Nios) నిలుస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ (Hyunda Grand i10 Nios CNG) వేరియంట్ ధర రూ.7.68 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఔరా సీఎన్జీ రూ.8.31 లక్షల నుంచి రూ.9.05 లక్షల (ఎక్స్ షోరూమ్), ఎక్స్టర్ సీఎన్జీ వేరియంట్ రూ.8.43 లక్షల నుంచి రూ.9.16 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!