Hyundai IPO | దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ (Hyundai Motor).. దేశీయంగా కార్ల విక్రయంలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారత్ మార్కెట్లోకి ఎంటరైన హ్యుండాయ్.. తాజాగా ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఐపీఓ ద్వారా అత్యధికంగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇంతకుముందు ఐపీఓ ద్వారా ఎల్ఐసీ రూ.21 వేల కోట్ల నిధులు సేకరించింది. ఇంతకంటే ఎక్కువ నిధులు సమీకరిస్తే ఎల్ఐసీ రికార్డును అధిగమిస్తుంది.
భారత్ ఈక్విటీ మార్కెట్ తోపాటు ఆసియా-పసిఫిక్ దేశాల ఎక్స్చేంజ్ ల్లో పలు సంస్థలు లిస్టింగ్ అయ్యాయి. హ్యుండాయ్ మోటార్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 22-28 బిలియన్ డాలర్లు ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నట్లు సమాచారం. వచ్చే దీపావళి నాటికి ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ తో 39 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. దీంతో భారత్ లోనూ హ్యుండాయ్ ఎం-క్యాప్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కంపెనీలో సంస్కరణలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. 2024లో నాలుగు నుంచి ఐదు శాతం గ్రోత్ సాధించొచ్చని తెలుస్తున్నది. 4.9 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడి ఖర్చుతోపాటు 5.6 లక్షల కోట్ల డాలర్లు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం మొత్తం 12.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని హ్యుండాయ్ మోటార్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది.