గురుగ్రామ్, జూలై 21: కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో హ్యుందాయ్ మోటర్‌కు చెందిన క్రెటా మరో మైలురాయికి చేరుకున్నది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి పదేండ్లు పూర్తైంది. జూలై 2015లో అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇప్పటి వరకు దేశీయంగా 12 లక్షల మంది కొనుగోలు చేశారు. దేశీయంగా మధ్యస్థాయి ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ వల్లనే గడిచిన పదేండ్లుగా విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయని హ్యుందాయ్ మోటర్ ఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు.
క్రెటా కేవలం ఒక కారు మాత్రమే కాదని, ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్, టర్బో, ఎలక్ట్రిక్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్..మాన్యువల్, ఆటోమేటిక్ ట్రా న్స్మిషన్లలో లభిస్తున్నది.