న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్లోకి సమ్మర్ ఎడిషన్‌గా క్రెటాను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.12 లక్షలుగా నిర్ణయించింది. పుష్ బటన్‌తో స్టార్ట్ కానున్న ఈ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 26 ఇంచుల డిజిటల్ క్లస్టర్ టచ్‌స్క్రీన్, డ్యాష్‌కామ్ రికార్డింగ్ మోడ్స్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటర్ ఇండియా నేషనల్ హెడ్ సునీల్ మూల్చందాని మాట్లాడుతూ..దేశీయ ఎస్యూవీ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన క్రెటాకు దేశవ్యాప్తంగా 14 లక్షల కస్టమర్లు ఉన్నారని, అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయన్నారు. దశాబ్దకాలం క్రితం దేశీయ రోడ్లపైకి అడుగుపెట్టిన ఈ క్రెటా మాడల్ 1.51 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్, 1.51 యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్‌తో తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు.