న్యూఢిల్లీ, మే 19: దేశీయ మార్కెట్‌కు నయా ఐ20 మాడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రకం ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలుగా నిర్ణయించింది. ఆరు రకాలుగా లభించనున్న ఈ మాడల్ గరిష్ఠ ధర రూ.9.99 లక్షలు.
స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, డిజిటల్ క్లస్టర్, ఏడు స్పీకర్ సౌండ్ సిస్టమ్, 25.55 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 15 ఏండ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ ఐ20 కార్లు దేశవ్యాప్తంగా 11 లక్షలు అమ్ముడయ్యాయి.