Hyundai Grand i10 Nios Hy-CNG Duo | దక్షిణ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ సీఎన్జీ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.7.75 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. హ్యుండాయ్ నుంచి సీఎన్జీ వర్షన్లో మార్కెట్లోకి వచ్చిన రెండో కారు ఇది. ఇంతకుముందు పాపులర్ ఎస్యూవీ ఎక్స్టర్ సీఎన్జీ వర్షన్ – ఎక్స్టర్-హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Exter Hy CNG Duo) మార్కెట్లోకి వచ్చింది.
గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు రెండు ట్రిమ్స్ – మాగ్నా (Magna), స్పోర్ట్జ్ (Sportsz) వేరియంట్లుగా వస్తోంది. స్పోర్ట్జ్ (Sportz) వేరియంట్ కారు ధర రూ.8.30 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. వీటితోపాటు హ్యుండాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios) కారును సింగిల్ సిలిండర్ ఆప్షన్ లోనూ ఆఫర్ చేస్తోంది.
గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు 1.2 లీటర్ల బై-ఫ్యూయల్ (Bi-Fuel) ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69 హెచ్‌పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీమ్‌లెస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ ఈసీయూ ఫీచర్ జత చేశారు.
గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు 20.25 సీఎం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుట్ వెల్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, రేర్ ఏసీ వెంట్స్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్, టెయిల్ లైట్స్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, అడ్జస్టబుల్ టిల్ట్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌తో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది. హైలైన్ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), రేర్ వ్యూ కెమెరా, డే అండ్ నైట్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ (ఐఆర్వీఎం), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) వంటి ఫీచర్లు జత చేశారు.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!