చెన్నై, సెప్టెంబర్ 6: ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన ఎక్స్టర్లో మరో రెండు మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఎస్(వో)ప్లస్ రకం ధర రూ.7,86,300గాను, ఎస్ ప్లస్ రకం ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ) రకం రూ.8,43,900గా నిర్ణయించింది.
ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. పాతదాంతో పోలిస్తే నయా వెర్షన్లో కొత్త ఫీచర్స్‌ను జోడించినట్లు ముఖ్యంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ క్లస్టర్, ఎనిమిది ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, యాపిల్ కార్ప్లే, రియర్ ఎయిర్-కండిషనర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్, టైర్-ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి 63,175 యూనిట్లకు పడిపోయాయి.